Nara Lokesh: వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో జగన్ నెంబర్ వన్​: నారా లోకేశ్​

Nara Lokesh lashes out Jagan
  • టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిలా?
  • పోలీస్ వ్యవస్థను ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు
  • అందుకే, ఈ రాష్ట్రంలో చట్టం అమలుపై కోర్టులు ప్రశ్నించింది 
వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో జగన్ నెంబర్ 1 అని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపారని, ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చీవాట్లు పెట్టిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తను 14 రోజులు రిమాండ్ కి పంపారని, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చాం అని ఒకసారి,  అతను పారిపోయాడని మరోసారి చెబుతారా? అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కనుకనే ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా? అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News