Corona Virus: కరోనా దెబ్బకు వెనుకడుగేసిన ఐపీఎల్... ప్రారంభ తేదీ వాయిదా

IPL start postponed due to corona outbreak
  • భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్
  • జనసమూహాలు వస్తే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని అంచనా
  • ఏప్రిల్ 15కి ఐపీఎల్ ప్రారంభ తేదీ వాయిదా
ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కరోనా వైరస్ కారణంగా కుదేలయ్యాయి. క్రీడల రంగం కూడా కరోనాతో ఇబ్బందులు పడుతోంది. కరోనా ప్రభావం కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించాలని మొదట భావించిన బీసీసీఐ, ఇప్పుడు మనసు మార్చుకుంది. ఐపీఎల్ ప్రారంభ తేదీని వాయిదా వేసింది.

ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభం కావాలి. అయితే భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో స్టేడియాల్లోకి జనసమూహాలను అనుమతించడం మహమ్మారి వ్యాప్తికి ఊతమిచ్చినట్టవుతుందని భావించారు. దాంతో ఐపీఎల్ ప్రారంభాన్ని ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే ఆపై తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
Corona Virus
IPL
India
Postpone
Cricket

More Telugu News