శ్రీకాళహస్తిలో ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: టీడీపీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రకటన
- టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు
- మా నామినేషన్ పత్రాలను చింపేశారు
- కష్టపడి నామినేషన్ వేస్తే తిరస్కరిస్తున్నారు
- ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
ఒకవేళ అన్నిటినీ ఎదుర్కొని కష్టపడి నామినేషన్ వేస్తే దాన్ని తిరస్కరిస్తున్నారని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల్లో ఏంటన్న భయం నెలకొందని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఆగడాలు అధికమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.