Chandan Shetty: హనీమూన్ కోసం ఇటలీ వెళ్లిన కన్నడ సెలబ్రిటీ కపుల్... వెనక్కు రానివ్వద్దంటూ కలెక్టర్ కు వినతి!

People plea to Mysore Collector Over Celebraity Couple
  • ఇటీవల చందన్, నివేదితల వివాహం
  • హనీమూన్ అర్ధాంతరంగా రద్దు
  • వెంటనే నగరంలోకి అనుమతించ వద్దని డిమాండ్
కరోనా భయాందోళన, ఇప్పుడు కన్నడ గాయకుడు, ఇటీవల వివాహం చేసుకున్న చందన్‌ శెట్టిని తాకింది. మైసూరులో నివేదితా గౌడతో వివాహం అనంతరం తన భార్యతో కలిసి హనీమూన్‌ నిమిత్తం చందన్ శెట్టి ఇటలీకి వెళ్లారు. ఆయన వెళ్లిన తరువాత కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో, తమ ఆనందాన్ని పక్కన పెట్టి, ప్రయాణాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి ఇండియాకు బయలుదేరారు.

ఈ వార్త తెలియగానే, మైసూరులో పలు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసిన పలువురు, ఇంతవరకూ మైసూరులో కరోనా లేదని, వారిద్దరినీ నగరంలోకి వెంటనే అనుమతించ వద్దని విజ్ఞప్తి చేశారు. వారికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, సామాన్యులను చూస్తున్నట్టుగానే 14 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి, ఆపై మాత్రమే వారిని అనుమతించాలని డిమాండ్ చేశారు.
Chandan Shetty
Nivedita
Honeymoon
Italy
Corona Virus

More Telugu News