Pavan: పవన్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమట!

Krish Movie
  • 'వకీల్ సాబ్' షూటింగులో బిజీగా పవన్ 
  • తదుపరి సినిమాకి జరుగుతున్న సన్నాహాలు 
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ
ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'పింక్' సినిమా రీమేక్ లో చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'వకీల్ సాబ్' టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, పవన్ చేయనున్న తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే దిశగా పనులను జరుపుకుంటోంది. మొఘల్ చక్రవర్తుల పాలనా కాలంలో ఈ కథ నడుస్తుంది. అందువలన ఆ కాలం నాటి సెట్స్ ను భారీగా వేస్తున్నారు. ఇందుకోసం నిర్మాత ఎ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ ను కేటాయించాడట. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. పవన్ కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం .. ఆయన కెరియర్లో తొలి భారీ బడ్జెట్ చిత్రం కూడా ఇదేనని అంటున్నారు. బందిపోటుగా పవన్ కనిపించనున్నాడనేది ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Pavan
Vakeel Saab Movie
Krish Movie

More Telugu News