విజయవాడలో కరోనా కేసు?
- జర్మనీ నుంచి గత రాత్రి వచ్చిన వ్యక్తి
- థర్మల్ స్క్రీనింగ్ లో కరోనా ప్రాథమిక నిర్ధారణ
- ప్రత్యేక గదిలో ఉంచిన అధికారులు
వెంటనే విమానాశ్రయం అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, ప్రత్యేక అంబులెన్స్ లో విజయవాడలోని అతని ఇంటికి తీసుకెళ్లి, రక్త నమూనాలను సేకరించారు. ప్రస్తుతం అతన్ని విడిగా ఓ గదిలో ఉంచామని, పరిస్థితిని నేడు సమీక్షించి అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తామని వైద్యాధికారులు తెలిపారు. కాగా, జర్మనీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ఢిల్లీలో స్క్రీనింగ్ పరీక్షలు జరిగినా వైరస్ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.