ప్రజలు తిరగబడితే మిమ్మల్ని పిచ్చికుక్కలను కొట్టినట్టు కొడతారు: వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక

  • నిన్న మాచర్లకు మా నాయకులు పది కార్లలో వచ్చారా?
  • వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు
  • దుర్మార్గంగా వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
నిన్న మాచర్లకు పది కార్లలో తమ నాయకులు వచ్చారని వైసీపీ నేతలు చెప్పడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

మూడు కార్లలో తమ వాళ్లు మాచర్లకు వెళ్లారని, అయితే పది కార్లలో వచ్చారని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, ‘బుద్ధి ఉన్నోడు ఈ మాట చెబుతారా?’ అంటూ వైసీపీ నేతలపై బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఆంబోతుల మాదిరి రోడ్డు మీద పడి ఇష్టానుసారం చేస్తే మేము భయపడాలా? సరెండర్ కావాలా? ఏకగ్రీవంగా మీకు వదిలిపెట్టాలా? అంటూ నిప్పులు చెరిగారు.

‘మీ ఆటలు సాగనివ్వం’ అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అంటే తమాషా అనుకోవద్దని, దుర్మార్గంగా వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, ‘ప్రజలు తిరగబడితే పిచ్చి కుక్కలను కొట్టినట్టు మిమ్మల్ని కొడతారు’ అని, ఆరోజు త్వరలోనే వస్తుందంటూ వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News