Corona Virus: కరోనా వ్యాప్తి చైన్ ను తెంపేద్దాం: ప్రధాని మోదీ
- ఆందోళన వద్దు.. ముందు జాగ్రత్తలు తీసుకుందాం
- అత్యవసరమైతే తప్ప ఎవరూ విదేశాలకు వెళ్లొద్దు
- కేంద్ర మంత్రులెవరూ వెళ్లొద్దని చెప్పామన్న ప్రధాని
కరోనా వ్యాప్తి గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, అందుకు బదులుగా గట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని.. ఈ లింకును తెంపేద్దామని... కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశముండే భారీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేశారు.