KTR: నిజంగానే విమానం నడిపిన అనుభూతిని సొంతం చేసుకున్న కేటీఆర్... వీడియో ఇదిగో!

KTR experiences flight simulator at Shamshabad
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ సిమ్యులేటర్ ఏర్పాటు
  • సిమ్యులేటర్ వ్యవస్థను ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • పైలెట్ సాయంతో విమానం ఇంజిన్ ను ఆపరేట్ చేసిన కేటీఆర్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫ్లైట్ సిమ్యులేటర్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్ఎస్ టీసీ)ను నెలకొల్పారు. తాజాగా ఈ సిమ్యులేటర్ వ్యవస్థను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సిమ్యులేటర్ ద్వారా విమానంతో పనిలేకుండానే విమానం నడిపేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. పైలెట్లకు మొదటగా శిక్షణ ప్రారంభమయ్యేది సిమ్యులేటర్లపైనే. ఆ తర్వాతే అసలు విమానాల్లో శిక్షణ ఇస్తారు. విమానం ఇంజిన్ లో ఎలాంటి వాతావరణం ఉంటుందో సిమ్యులేటర్ లోనూ అదే తరహా యంత్రాంగ్రం ఉంటుంది.

మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ లో కూర్చుని తాను కూడా మీటలు నొక్కుతూ నిజంగానే విమానం నడిపిన అనుభూతి సొంతం చేసుకున్నారు. కాక్ పిట్ లో ఉన్న పైలెట్ మంత్రి కేటీఆర్ కు సూచనలు ఇస్తూ ఆయనతో విమానం ఇంజిన్ ను ఆపరేట్ చేయించారు. 
KTR
Flight Simulator
Shamshabad
Hyderabad
Telangana

More Telugu News