AP High Court: విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న పిటిషన్​ పై విచారణ

  • చంద్రబాబుకు సీఆర్పీసీ 151 కింద నోటీస్ ఎలా ఇస్తారు?
  • ఈ నోటీసు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?
  • 151 సెక్షన్ ఆర్డర్ ను చదవమని డీజీపీని ఆదేశించిన న్యాయమూర్తి
Inquiry into the petition that blocked Chandrababu in Visakha

ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఇటీవల విశాఖపట్టణం వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని విమానాశ్రయంలో అడ్డుకున్న ఘటన తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ చేసింది.

ఈ ఘటన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సీఆర్పీసీ 151 సెక్షన్ ఆర్డర్ కింద నోటీస్ ఎలా ఇస్తారు? ఈ నోటీసు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు? అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ సందర్భంగా 151 సెక్షన్ ఆర్డర్ ను చదవమని డీజీపీని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన సమాధానమిచ్చారు. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయస్థానానికి సవాంగ్ తెలిపారు.

More Telugu News