Budda Venkanna: వివేకా హత్య కేసులోనూ ఆయనే ఏ2: బుద్ధా

TDP MLC Buddha Venkanna comments on Vijayasai Reddy
  • విజయసాయిని లక్ష్యంగా చేసుకున్న బుద్ధా వెంకన్న
  • హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపణ
  • ఏ2 నుంచి సీబీఐ విచారణ మొదలుపెట్టాలని విజ్ఞప్తి
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులోనూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే ఏ2 అని పేర్కొన్నారు. దారుణంగా జరిగిన హత్యను గుండెపోటు అని చిత్రీకరించారని, సీబీఐ విచారణ ఏ2 నుంచి మొదలుపెట్టాలని కోరారు. గుండెపోటు దగ్గర్నుంచి విచారణ మొదలుపెడితే వివేకా కేసు వెనుక ఉన్న జగన్ పోటు బయటపడుతుందని సూచించారు.
Budda Venkanna
Vijay Sai Reddy
YS Vivekananda Reddy
Murder
CBI
Heart Attack
Telugudesam
YSRCP

More Telugu News