Bonda Uma: చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు: బోండా ఉమ

YSRCP tapping our phones including Chandrababu says Bonda Uma
  • మమ్మల్ని చంపేందుకు నిన్న మూడు సార్లు ప్రయత్నించారు
  • తాడేపల్లి కార్యాలయం నుంచే హత్యాయత్నానికి స్కెచ్ వేశారు
  • మాకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలి
వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా పార్టీకి చెందిన అందరు నేతల ఫోన్లను జగన్ సర్కార్ ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు సార్లు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నానికి సంబంధించిన స్కెచ్ మొత్తం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగిందని చెప్పారు.

మాచర్లకు తాము వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారని ఉమ ఆరోపించారు. తమకు పోలీసులపై నమ్మకం పోయిందని చెప్పారు. తమకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. గన్ మెన్లతో తమకు భద్రత కల్పించాలని కోరారు.
Bonda Uma
Chandrababu
Telugudesam
Phone Tapping
Jagan
YSRCP

More Telugu News