Pulivarthi Nani: ఈమాత్రం దానికి ఎన్నికలు జరపడం ఎందుకు?: చిత్తూరు టీడీపీ నేత పులివర్తి నాని

Pulivarthi Nani gets anger over nominations issue
  • తమ నామినేషన్లు తిరస్కరించారన్న చిత్తూరు టీడీపీ చీఫ్
  • నామినేషన్ పత్రాలు చించేసి రౌడీరాజ్యం చూపిస్తున్నారని ఆగ్రహం
  • ఫుల్ స్టాప్, కామాలు లేకపోయినా నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపణ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారని, ఈమాత్రం దానికి ఎన్నికలు జరపడం ఎందుకని మండిపడ్డారు. నామినేషన్ పత్రాలు చించేసి రౌడీ రాజ్యం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న కారణాలు చూపి నామినేషన్లు పక్కనబెట్టడం దౌర్భాగ్యమని అన్నారు. నామినేషన్లు తిరస్కరించడానికి గల కారణాలు ఘోరంగా ఉంటున్నాయని పులివర్తి నాని విమర్శించారు. ఫుల్ స్టాప్, కామాలు లేకపోయినా టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.
Pulivarthi Nani
Telugudesam
Chittoor District
Local Body Polls
Nominations
YSRCP
Andhra Pradesh

More Telugu News