Chandrababu: తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన న్యాయవాది కిశోర్ ను పరామర్శించనున్న చంద్రబాబు

Chandrababu to visit lawyer Kishore at NRI hospital
  • గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై దాడి
  • తీవ్రగాయాలపాలైన హైకోర్టు న్యాయవాది కిశోర్
  • మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న కిశోర్
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన హైకోర్టు న్యాయవాది కిశోర్ ప్రస్తుతం ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిశోర్ ను ఈ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు.

కాగా, మాచర్లలో దాడి జరిగిన వెంటనే కిశోర్ కు చెందిన విజువల్స్ దిగ్భ్రాంతికి గురిచేశాయి. రక్తసిక్తమైన చొక్కాతో ఆయన భీతిగొలిపే విధంగా కనిపించారు. అయితే, గాయపడిన వెంటనే కిశోర్ కు సరైన రీతిలో చికిత్స అందించలేదని ఎన్నారై వైద్యులు అభిప్రాయపడ్డారు. తలకు తగిలిన దెబ్బలు తీవ్రమైనవి కావడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయమే కిశోర్ ను మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
Chandrababu
Kishore
NRI Hospital
Mangalagiri
Macharla
Telugudesam
YSRCP

More Telugu News