Lottery: లాటరీ రూపంలో అదృష్టం పిలిచినా, గుండెపోటు రూపంలో దురదృష్టం కబళించింది!

Kerala man dies without taking his lottery money

  • కేరళలో విషాద ఘటన
  • రూ.60 లక్షల లాటరీ గెలిచిన దుకాణం యజమాని
  • బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకునే క్రమంలో గుండెపోటుతో మరణం

కేరళకు చెందిన సి.తంబి కథ ఓ విషాదాంతం. అలప్పుళ పట్టణంలో ఓ దుకాణం యజమాని అయిన తంబి రూ.60 లక్షల లాటరీ గెలిచినా, ఆ డబ్బు తీసుకోకుండానే కన్నుమూశాడు. తంబి ఇటీవల తన దుకాణంలో 'స్త్రీ శక్తి' లాటరీలు విక్రయించాడు. కొన్ని లాటరీలు అమ్ముడుపోలేదు. దాంతో వాటిని తన వద్దే ఉంచుకున్నాడు.

అయితే వాటిలో ఓ లాటరీకి రూ.60 లక్షల బహుమతి వచ్చింది. ఆ డబ్బు తీసుకునేందుకు ఫెడరల్ బ్యాంకుకు వెళ్లి అక్కడి లాంఛనాలు పూర్తి చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మళ్లీ లేవనేలేదు. తంబిని ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించాడని డాక్టర్లు వెల్లడించారు. దాంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రూ.60 లక్షల లాటరీ వచ్చినందుకు సంతోషించాలో, ఇంటిపెద్ద ఈ లోకాన్ని విడిచి వెళ్లినందుకు బాధపడాలో అర్థంకాని స్థితిలో తంబి కుటుంబసభ్యులు కుమిలిపోతున్నారు.

  • Loading...

More Telugu News