Jagan: వైసీపీ రేపు పదో ఏట అడుగుపెడుతోంది... మీ అందరి దీవెనలు కావాలి: సీఎం జగన్

Jagan asks people blessings on the eve of YSRCP tenth anniversary
  • వైఎస్సార్ మరణం తర్వాత ఏర్పడిన వైసీపీ
  • ఆదరించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు అంటూ సీఎం జగన్ ట్వీట్
  • పార్టీ కుటుంబసభ్యులు అంటూ కార్యకర్తలు, నేతలపై అనురాగం
నాడు వైఎస్సార్ మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా పురుడుపోసుకున్న పార్టీ వైసీపీ. రేపటితో వైసీపీ పదో ఏట అడుగుపెడుతోంది. దీనిపై సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. "మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైసీపీ రేపు 10వ ఏట అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నా వెంట నడిచిన వైసీపీ కుటుంబసభ్యులకు, మమ్మల్ని ఆదరించిన రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికీ వందనాలు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ విజ్ఞప్తి చేశారు.
Jagan
YSRCP
Anniversary
YSR
Andhra Pradesh

More Telugu News