Macherla: మాచర్ల ఘటనలో ముగ్గురి అరెస్టు.. హత్యాయత్నం కింద కేసు నమోదు: ఐజీ ప్రభాకర్ రావు

Three accused Arrested in Macherla attacks case
  • తురకా కిశోర్, మల్లెల గోపి, బత్తుల నాగరాజును అరెస్టు చేశాం
  • వెల్దుర్తి మండలంలో మరికొంతమంది నిందితుల  గుర్తింపు
  • టీడీపీ నేతల వాహనం, పోలీస్ వాహనం ధ్వంసమయ్యాయి  
మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై జరిగిన దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డ తురకా కిశోర్, మల్లెల గోపి, బత్తుల నాగరాజును పోలీసులు  అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఐజీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, నిందితులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వెల్దుర్తి మండలంలో మరికొంతమంది నిందితులను గుర్తించామని అన్నారు. ఈ ఘటనలో టీడీపీ నేతల వాహనంతో పాటు, పోలీస్ వాహనం ధ్వంసమైందని చెప్పారు.
Macherla
Telugudesam
Bonda Uma
Budda Venkanna
Attacks

More Telugu News