Budda Venkanna: చెడు చేయాలని బయల్దేరి ఉంటే ఈ రోజు ఇద్దరం శవాలై ఉండేవాళ్లం: బుద్ధా వెంకన్న

Buddha Venkanna tells about the attack incident
  • మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి
  • మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించిన ఇరువురు నేతలు
  • కుంటిసాకులు చెబుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డ బుద్ధా
  • దేవుడి దయతో బయటపడ్డామని వ్యాఖ్యలు
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ఈ దాడి పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న మంగళగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుద్ధా మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి ఘటనపై కుంటిసాకులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

"పసిపిల్లవాడ్ని గుద్దేసి వెళ్లిపోయామని, దాంతో గొడవైందని అంటున్నారు. ఇవన్నీ పనికిమాలిన దద్దమ్మలు చెప్పే మాటలు. దైవసమానుడిగా భావించి మా ఇంట్లో చంద్రబాబు ఫొటో పెట్టుకున్నాం. ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాం. ఇవాళ మేం ఏదో చెడు చేయాలనుకుని బయల్దేరి ఉంటే మా ప్రాణాలు మిగిలేవి కావు. బోండా ఉమ, నేను శవాలై ఉండేవాళ్లం. ఎప్పుడూ మంచి చేయాలని చెప్పే దేవుడి లాంటి చంద్రబాబు సంకల్పమే మమ్మల్ని కాపాడింది" అంటూ వివరించారు.
Budda Venkanna
Bonda Uma
Macherla
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News