Devineni Uma: జగన్ ప్రోద్బలం లేకుండా ఈ దాడి జరిగిందా?: దేవినేని ఉమ

Devineni Uma doubts there is Jagan hand behind the attack
  • మాచర్లలో బోండా ఉమ, బుద్ధాపై తీవ్రస్థాయిలో దాడి
  • ఖండించిన దేవినేని ఉమ
  • ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం
మాచర్లలో టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్ చేశారు. అడ్డుకున్న డీఎస్పీపైనా, న్యాయవాదిపైనా వైసీపీ కిరాయి మూకలు దాడికి పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా ఉందని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రోద్బలం లేకుండా ఈ దాడి జరిగి ఉంటుందా? అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ఇవాళ గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై తీవ్రస్థాయిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Devineni Uma
Bonda Uma
Budda Venkanna
Macherla
Guntur District
Telugudesam
YSRCP

More Telugu News