RTC: ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్

CM KCR fulfills his promise to TSRTC employees
  • తెలంగాణలో నెల రోజులకు పైగా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్
  • రూ.235 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు వారాల తరబడి సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెపై చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారు. సమ్మెకాలానికి తప్పకుండా జీతభత్యాలు చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడాయన తన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకాలానికి సంబంధించిన జీతభత్యాలను సర్కారు విడుదల చేసింది. మొత్తం రూ.235 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
RTC
Salary
KCR
Telangana
Strike

More Telugu News