Telugudesam: దాడిలో న్యాయవాది కిశోర్‌ చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయిన వైనం

  • టీడీపీ నేతలతో ఉన్న న్యాయవాది కిశోర్‌ తలకు తీవ్రగాయాలు
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలకలం రేపుతున్న దాడులు 
  • మండిపడుతోన్న టీడీపీ నేతలు
మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తల దాడులు కలకలం రేపుతున్నాయి. టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు పలువురు మాచర్ల ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో వారిపై స్థానిక వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. వారిని బైకులపై వెంబడించి కర్రలు, పదునైన ఆయుధాలతో దాడికి యత్నించారు.

టీడీపీ నేతలతో ఉన్న న్యాయవాది కిశోర్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయింది. వైసీపీ కార్యకర్తలు దాడి జరిపిన సమయంలో టీడీపీ నేతల కారు నడుపుతోన్న డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించి ఆ కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దాడులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

గాయపడ్డ న్యాయవాది కిశోర్‌తో చంద్రబాబు ఫోనులో మాట్లాడారు. నామినేషన్‌ వేసే వీలులేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిన విషయాలను పరిశీలించడానికి వెళ్లానని ఆయన చెప్పారు. ఒక్కసారిగా వారు వచ్చి దాడి చేయడంతో తన తలకు గాయమైందని కిశోర్ తెలిపారు. దీంతో పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కిశోర్‌కు చంద్రబాబు సూచించారు. 
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News