Nani: 'వి' సినిమాలో ఫైనల్ ట్విస్ట్ ఒక రేంజ్ లో వుంటుందట!

V Movie
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా 'వి'
  • పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు 
  • సీరియల్ కిల్లర్ గా నాని  
నాని కథానాయకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'వి' సినిమా, ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఇది నానికి 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, సీరియల్ కిల్లర్ గా నాని నటించాడు.

పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్ వరకూ నానీ పాత్రను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రగా చూపిస్తూ వచ్చారు. రాక్షసుడు అంటూనే ఆయన పాత్రను గురించి చెప్పారు. అయితే సినిమా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సుధీర్ బాబు విలన్ గా ప్రేక్షకుల ముందు నిలబడతాడని అంటున్నారు. ఆ ఫైనల్ ట్విస్ట్ ను ఆవిష్కరించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందనీ, అది ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుందని చెబుతున్నారు.  
Nani
Sudheer Babu
Indraganti Mohana Krishna
V Movie

More Telugu News