Jagan: జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు
- సీఎంను కలిసిన సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి
- జగన్‌తో కాసేపు మాట్లాడిన నేతలు
- త్వరలో రాజ్యసభ ఎన్నికలు
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీచేసే వైసీపీ అభ్యర్థుల పేర్లను ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను రాజ్యసభకు పంపుతామని వైసీపీ ప్రకటన చేసిన నేపథ్యంలో వారు ఈ రోజు జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
జగన్‌కు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి, కాసేపు మాట్లాడారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్ సత్వానీని కూడా వైసీపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం నాలుగు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీట్లన్నీ వైసీపీకే దక్కనున్నాయి.