nagababu: ఏమిటో ఈ జనం.. దేవుడా ఈ జనాల మనసు మార్చు!: నాగబాబు

nagababu about voter
  • ఏపీ రాజకీయాలపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు
  • లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు
'లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏమిటో ఈ జనం. దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్)' అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. జనసేనను ఓడించి, వైసీపీని అధికారంలో, టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

నాగబాబు ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు కేక అన్నా', 'కొన్ని జీవితాలు అంతే మారవు' , 'ఈ అలవాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రమే ఉంది.. ప్లీజ్ మారండి' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.
nagababu
Janasena
Andhra Pradesh
Twitter

More Telugu News