Sathish Reddy: వైయస్ కుటుంబాన్ని ఎదుర్కొన్నా.. అయినా చంద్రబాబుకు నాపై నమ్మకం లేదు.. రాజీనామా చేస్తున్నా: సతీశ్ రెడ్డి

TDP leader Sathish Reddy announces his resignation to party
  • పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా
  • నాపై చంద్రబాబుకు నమ్మకం లేదు
  • పార్టీలో కొనసాగలేను
కడప జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. దశాబ్దాలుగా వైయస్ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తున్న టీడీపీ నేత సతీశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబుతో తనకు గ్యాప్ పెరిగిందని చెప్పారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... అయినా తనపై చంద్రబాబుకు పూర్తి నమ్మకం లేదని అన్నారు. పులివెందులలో పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డానని... వైయస్ కుటుంబంతో దశాబ్దాలుగా పోరాడానని... అయినా పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని, తనను ఆదరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగలేనని చెప్పారు.
Sathish Reddy
Telugudesam
Pulivendula
Resign
YSRCP
YS Family
Chandrababu

More Telugu News