Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోందని, టైమ్ స్లాట్ టోకెన్లు, నడకదారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 67,228 మంది భక్తులు దర్శించుకోగా, 23,633 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.50 కోట్ల ఆదాయం లభించింది.
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News