Amitabh Bachchan: అమితాబ్ నోట మాట రాకుండా చేసిన వింటేజ్‌ కారు

Amitabh Bachchan Left Speechless with This Vintage Car
  • ఫొటోను ట్విట్టర్‌‌లో షేర్ చేసిన బిగ్ బీ
  • కారు గురించి వర్ణించేందుకు మాటలు రావడం లేదని ట్వీట్
  • సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న బచ్చన్‌
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గొంతు ఎంత గంభీరంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన డైలాగ్ చెబితే థియేటర్ దద్దరిల్లుతుంది. సినిమాల్లోనే  కాదు తెరవెనుక కూడా బిగ్‌ బి తనదైన శైలిలో మాటలు సంధిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్లు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి అమితాబ్‌ నోట మాట రాకుండా చేసింది ఓ వింటేజ్‌ కారు. ఈ విషయాన్ని బిగ్‌బీనే చెప్పారు. తన ట్విట్టర్ అకౌంట్లో అమితాబ్ సోమవారం ఓ ఫొటో షేర్‌‌ చేశారు.

పింక్‌ కలర్ కుర్తా ధరించిన ఆయన పసుపు రంగు వింటేజ్‌ కారు ముందు నిలబడి నవ్వుతూ ఉన్న ఈ ఫొటో అందరినీ ఎన్నో ఏళ్లు వెనక్కు తీసుకెళ్లింది. ఈ వింటేజ్‌ కారుకు ఫిదా అయిన బచ్చన్‌ దాని గురించి వర్ణించేందుకు తనకు మాటలు రావడం లేదని ట్వీట్ చేశారు.

‘కొన్నిసార్లు మన నోట మాట రాదు. ఇప్పుడు నేనా పరిస్థితిలోనే ఉన్నా. ఏదో చెప్పాలని చూస్తున్నా కానీ, ఏమీ బయటకు రావడం లేదు. ఇది గడచిన కాలం కథ. కాలాన్ని మించిన అనుభూతి’ అంటూ రాసుకొచ్చారు. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న అమితాబ్‌ ఆసక్తికర పోస్టులు, ట్వీట్లతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు.
Amitabh Bachchan
Vintage Car
Bollywood

More Telugu News