Shiva Shankar: అదే రామారావుగారి గొప్పతనం: డాన్స్ మాస్టర్ శివశంకర్

Shiva Shankar
  • ఒక హీరో ఆలా చెప్పించాడు 
  • వెయిట్ చేయించే వాళ్లు వున్నారు 
  • రామారావుగారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారన్న శివశంకర్ మాస్టర్   
శివశంకర్ మాస్టర్ ఎన్నో సినిమాలకి నృత్య దర్శకత్వం వహించారు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఆయన నృత్య రీతులను సమకూర్చారు. అలాంటి శివశంకర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఒక హీరో వరుస పరాజయాలతో వున్నప్పుడు ఆయన సినిమాకి నేను పనిచేశాను. ఆ సినిమా హిట్ కావడంతో ఆ హీరో క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరువాత కలుద్దామని వెళితే, ఇంట్లోనే వుండి కూడా లేరని చెప్పించాడు. కారవాన్ లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ వెయిట్ చేయించే వాళ్లు చాలామందే వున్నారు.

ఈ సందర్భంలో రామారావుగారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఒకసారి నేను ఆయనను కలవడానికి వెళితే, ఆయన చాలా బిజీగా వున్నారు. అయినా నన్ను ఆ పక్కనే వున్న రూమ్ లో కూర్చోబెట్టారు. మాస్టర్ గారికి ఏం కావాలో చూడమని అక్కడివారికి చెప్పారు. ఆ తరువాత వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అందుకే ఆ మహానుభావుడి గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు" అని అన్నారు.
Shiva Shankar
N.T.RamaRao
Tollywood

More Telugu News