Varla Ramaiah: డొక్కా వ్యాఖ్యలు అవాస్తవం: టీడీపీ నేత వర్ల రామయ్య

TDP Leader Varla Ramaiah comments on Varla ramaiha letter
  • డొక్కా మాణిక్యవరప్రసాద్ లేఖపై వర్ల స్పందన
  • శాసనమండలిలో అత్యంత కీలక సమయంలో డొక్కా గైర్హాజరయ్యారు
  • వైసీపీకి ఆయన మళ్లారన్న విషయం అప్పుడు అర్థమైంది 
టీడీపీ ఎమ్మెల్సీ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈరోజు ఓ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వలేదని, ప్రత్తిపాడు నుంచి పోటీ చేయమన్న అధిష్ఠానం ఆదేశాలను శిరసావహించి చివరకు ఓటమిపాలయ్యానంటూ ఆ లేఖలో డొక్కా పేర్కొనడంపై చర్చనీయాంశమైంది.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ, డొక్కా వ్యాఖ్యలు అవాస్తవమని, శాసనమండలిలో అత్యంత కీలక సమయంలో డొక్కా గైర్హాజరయ్యారని, ఓటింగ్ సమయంలో మండలికి రాకపోవడంతోనే వైసీపీకి మళ్లారన్న విషయం అర్థమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డొక్కాకు తమ పార్టీ సముచిత స్థానం కల్పించిందని, కనీసం వైసీపీలో అయినా డొక్కా కొనసాగాలని కోరుకుంటున్నామని సెటైర్లు విసిరారు.
Varla Ramaiah
Telugudesam
Dokka Manikya Varaprasad
letter

More Telugu News