Sachin Tendulkar: సచిన్‌ టెండూల్కర్‌తో ఇర్ఫాన్‌ పఠాన్‌ కుమారుడు ఇమ్రాన్‌ బాక్సింగ్.. క్యూట్ వీడియో

sachin with irfan son
  • వీడియోను పోస్ట్ చేసిన పఠాన్
  • పెద్దయ్యాక కచ్చితంగా బాక్సర్‌ అవుతాడని వ్యాఖ్య
  • ఒక రోజు ఆ చిన్నారి కండలు తన కన్నా దృఢంగా అవుతాయన్న సచిన్ 
టీమిండియా మాజీ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌తో ఇర్ఫాన్‌ పఠాన్‌ కుమారుడు ఇమ్రాన్‌ ఖాన్‌ బాక్సింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియోను పఠాన్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇమ్రాన్‌ ఏం చేశాడో వాడికి తెలియదని ఆయన చెప్పాడు. పెద్దయ్యాక కచ్చితంగా బాక్సర్‌ అవుతాడని, సచిన్‌తో బాక్సింగ్‌ చేశాడని తెలిపాడు.

దీనిపై స్పందించిన సచిన్‌... చిన్నారులతో సమయాన్ని పంచుకోవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పారు. చిన్నారి ఇమ్రాన్‌కు ఓ విషయాన్ని తెలిపారు. ఏదో ఒక రోజు ఆ చిన్నారి కండలు, తన కన్నా, అతడి తండ్రి కన్నా చాలా దృఢంగా, పెద్దగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ వీడియో సచిన్‌ అభిమానులను అలరిస్తోంది.
Sachin Tendulkar
irfankhan
Cricket

More Telugu News