ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు: మహిళల జట్టుపై సౌరవ్ గంగూలీ ప్రశంసలు
- టీ20 ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన మహిళల జట్టు
- ఫైనల్స్ లో ఆసీస్ చేతిలో ఓటమి
- అద్భుతంగా ఆడారంటూ ప్రశంసించిన గంగూలీ
మహిళల జట్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఆడారని, ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారని ఆయన కొనియాడారు. ఈ జట్టును అమితంగా ఇష్టపడుతున్నానని చెప్పారు. మరోవైపు మహిళల జట్టుపై క్రికెట్ దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ తో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా ప్రశంసలు కురిపించారు.