Corona Virus: కరోనా పారిపోవాలంటూ మహిళల సాంగ్... వైరల్ అవుతున్న పాట ఇదే!

Video Viral On Corona
  • దాదాపు 100 దేశాల్లో విస్తరించిన వైరస్
  • కాంగ్రెస్ నేత కృష్ణ మోహన్ షేర్ చేసిన పాట
  • 69 వేలకు పైగా వ్యూస్
దాదాపు 100 దేశాలకు విస్తరించి, వేలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ ఇండియాలో విస్తరించకుండా ఉండాలని కోరుతూ, వైరస్ పారిపోవాలన్న అర్థంలో కొందరు మహిళలు పాడుతున్న ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ కాంగ్రెస్ నేత కృష్ణ మోహన్ శర్మ, ఈ పాటకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటికే ఇది 69 వేలకు పైగా వ్యూస్ తెచ్చుకుని దూసుకెళుతోంది. కాగా, కరోనాపై ఇప్పటికే పలు పాటలు, మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాను ముంచేస్తున్నాయి.
Corona Virus
Song
Viral Videos

More Telugu News