New Delhi: దేశ రాజధానిలో మారణహోమానికి దంపతుల పథక రచన... ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrest couple who plots suicide attack in Delhi
  • ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన పోలీసులు
  • పోలీసుల అదుపులో జహంజేబ్, హీనా
  • ఇద్దరికీ ఐసిస్ తో సంబంధాలున్నట్టు ఆరోపణలు
భారత్ లో ప్రస్తుతం సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనల మాటున ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ జంట పథక రచన చేయగా, పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్ కు చెందిన జహంజేబ్ షమీ, హీనా బేగ్ దంపతులు. జహంజేబ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. అయితే సోషల్ మీడియాలో భార్యతో కలిసి ఇండియన్ ముస్లిం యునైట్ పేరుతో పేజీ నిర్వహిస్తూ సీఏఏ, ఎన్సార్సీ వ్యతిరేక భావజాలాన్ని ఎగదోస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, ఢిల్లీలో మారణహోమం సృష్టించాలని ఆత్మాహుతి దాడికి వ్యూహరచన చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. వీరిద్దరినీ ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ సమీపంలోని వారి నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లోని ఐసిస్ విభాగంతో సంబంధాలు నెరుపుతున్నట్టు జహంజేబ్, హీనాలపై ఆరోపణలు ఉన్నాయి.
New Delhi
CAA
NCR
Couple
Suicide Attack
Police

More Telugu News