Roshini Kapoor: ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుమార్తెను ముంబయి విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు

Officials stoopped Rana Kapoor daughter Roshini
  • దేశంలో సంచలనం సృష్టించిన ఎస్ బ్యాంకు సంక్షోభం
  • రానా కపూర్ కుటుంబ సభ్యులపై లుకౌట్ నోటీసులు జారీ
  • లండన్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చిన రాణా కపూర్ కుమార్తె
ఎస్ బ్యాంకు సంక్షోభంలో ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, రాణా కపూర్ కుమార్తె రోషిణిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, లండన్ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. రోషిణిపైనే కాదు, వారి ఇతర కుటుంబ సభ్యులపైనా దేశం విడిచిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రోషిణి లండన్ కు బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో వెళ్లాల్సి ఉండగా, మరికొద్దిసేపట్లో విమానం ఎక్కుతుందనగా అధికారులు ఆపేశారు.
Roshini Kapoor
Rana Kapoor
Yes Bank
Mumbai
London

More Telugu News