Shefali Varma: ఓటమిని భరించలేక కన్నీటి పర్యంతమైన టీమిండియా యువ ఓపెనర్

Team India opener Shefali cries down at award ceremony
  • టి20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
  • పరుగులు చేయడంలో విఫలమైన షెఫాలీ వర్మ
  • బహమతి ప్రదానోత్సవంలో తీవ్ర భావోద్వేగాలకు లోనైన వైనం
టీమిండియాలో అడుగుపెట్టిన కొన్నిదినాల్లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ. పురుషులకు దీటుగా బంతిని బలంగా బాదుతూ జట్టులో సుస్థిర స్థానం పొందింది. టి20 వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ వరకు విధ్వంసక ఇన్నింగ్స్ లతో విజృంభించిన షెఫాలీ దురదృష్టవశాత్తు ఆఖరి అంకంలో విఫలమైంది. ఆసీస్ తో ఫైనల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో షెఫాలీ కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుండగా, తీవ్ర భావోద్వేగాలకు లోనైన ఈ టీనేజ్ అమ్మాయి భోరున ఏడ్చేసింది. దాంతో సహచర క్రికెటర్లు ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Shefali Varma
India
Australia
T20 World Cup

More Telugu News