Team India: మీ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాం... మీకంటూ ఓ రోజొస్తుంది: టీమిండియా మహిళలకు సచిన్ ఓదార్పు

Sachin comments on India women lose in T20 World Cup final
  • మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి
  • భవిష్యత్తులో మరింత దృఢమైన జట్టుగా ఎదుగుతారని వెల్లడి
  • ఆశాభావాన్ని వీడొద్దంటూ హితవు
మహిళల టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా వచ్చిన టీమిండియా, ఆఖరిపోరాటంలో విఫలం కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారీ లక్ష్యఛేదనలో కనీస పోరాటం కూడా లేకుండా టీమిండియా అమ్మాయిలు ఓడిన విధానం మరింత బాధిస్తోంది.

దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలియజేశారు. " టీమిండియాకు ఇది నిజంగా క్లిష్టమైన సమయం. మనది ఇంకా యువ జట్టే కాబట్టి భవిష్యత్తులో మరింత దృఢమైన జట్టుగా ఎదుగుతుంది. ఇప్పటివరకు మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్విస్తున్నాం. కఠోరంగా శ్రమించండి, ఆశాభావాన్ని వీడొద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా సాధిస్తారు" అంటూ ట్విట్టర్ లో ఓదార్పు వచనాలు పలికారు.
Team India
Women
Sachin Tendulkar
T20 World Cup
India
Australia

More Telugu News