Byreddy Rajasekar Reddy: మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎవరైనా కాంగ్రెస్ నేతలు చనిపోవాల్సిందే!: బైరెడ్డి

Byreddy Rajasekhar Reddy comments on Congress party future
  • కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బైరెడ్డి
  • ఇప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని వెల్లడి
  • ముస్లింల కోసమే రాహుల్ సీఏఏను వ్యతిరేకిస్తున్నారంటూ విమర్శలు
ఏపీ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పట్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని అన్నారు. అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ నేతలెవరైనా చనిపోవాలని, లేకపోతే ఎవరైనా వాళ్లను చంపాలని వ్యాఖ్యానించారు. ముస్లింల ఓట్ల కోసమే రాహుల్ గాంధీ సీఏఏను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అటు రాష్ట్ర పరిణామాలపై స్పందిస్తూ, గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీల ద్వారా ఎన్నికల్లో ముందుకు వెళ్లేవారని, ఇప్పుడు వైసీపీ గ్రామ వలంటీర్ల సాయంతో ముందుకెళుతోందని ఆరోపించారు.
Byreddy Rajasekar Reddy
Congress
Rahul Gandhi
BJP
Kurnool

More Telugu News