AB Venkateswara Rao: ఏపీ ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్​ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్.. సస్పెన్షన్ సమర్థన​!

Central Home Ministry supports AP government decesion about AB Venkateswararao
  • ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ
  • ఏబీ భారీ అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు 
  • ఏబీపై చార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పిన కేంద్రం
అవినీతి ఆరోపణల కేసులో ఇటీవల సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను కేంద్ర హోం శాఖ సమర్థించింది. ఏరోశాట్, మానవ రహిత ఏరియల్ (యూఏవీ) ఇంటెలిజెన్స్ పరికరాల కొనుగోలులో భారీ అక్రమాలకు ఆయన పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ ఓ లేఖ రాసింది. ఏబీపై చార్జిషీట్ దాఖలు చేయాలని, వెంకటేశ్వరరావు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఏప్రిల్ 7 లోగా నివేదిక ఇవ్వాలని ఈ లేఖలో పేర్కొంది.
AB Venkateswara Rao
IPS
Andhra Pradesh
Central Home ministry

More Telugu News