KCR: ఏపీలో కూడా జిల్లాల సంఖ్య పెరగనుంది: సీఎం కేసీఆర్​

Telangana CM Kcr says Number of districts in AP to reach 25
  • స్వాతంత్య్రం వచ్చాక ప.బెంగాల్, ఉమ్మడి ఏపీల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాలేదు
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల సంఖ్య పెంచాం
  • ఇప్పుడు ఏపీలో కూడా జిల్లాల సంఖ్య పెరగనుంది
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) మినహా అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో ఉన్న 9 జిల్లాలను 31కు పెంచామని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ, తనకు ఉన్న సమాచారం మేరకు ఆ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని, ఏపీలో జిల్లాల సంఖ్య13 నుంచి 25కు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.  
KCR
TRS
Telangana
Assembly
Andhra Pradesh
Districts

More Telugu News