anchor pradeep: యాంకర్ ప్రదీప్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన ‘పెళ్లిచూపులు‘ నటి

Dating news with anchor pradeep was false says pellichoopulu show actress
  • జ్ఞానేశ్వరితో ప్రదీప్ డేటింగ్ చేస్తున్నాడని కామెంట్
  • అవన్నీ పుకార్లే అని కొట్టి పారేసిన జ్ఞానేశ్వరి
  • ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రదీప్
తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రదీప్ ఓ నటితో చాలా రోజులుగా ప్రేమలో ఉన్నాడన్న పుకార్లు వస్తున్నాయి. అలాగే, కొంతకాలం క్రితం ప్రదీప్ చేసిన ‘పెళ్లి చూపులు’ అనే షోలో పాల్గొని విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరితో అతను డేటింగ్ చేశాడని దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ కామెంట్ చేశాడు.

అయితే, ఇవి ఒట్టి పుకార్లే అని జ్ఞానేశ్వరి స్పష్టం చేసింది. తనకు సినిమాలు, టీవీ షోలపై అసక్తే లేదని చెప్పింది. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్న తాను.. కొలీగ్  తీసిన షార్ట్ ఫిలింలో సరదాగా నటించానని తెలిపింది. అదే క్రమంలో పెళ్లి చూపులు షోలో కూడా పాల్గొన్నానని చెప్పింది. దాంతో, ప్రదీప్ తో తాను ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయని, అవన్నీ పుకార్లే అని స్పష్టం చేసింది.
anchor pradeep
pellichoopulu show
gnaneshwari
dating
news
gossips

More Telugu News