Budda Venkanna: మీ నాయకుడు జగన్‌ రెడ్డికే సిగ్గు లేదు!: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్‌

budda venkanna criticises vijay sai reddy and jagan
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు
  • ఒక సారి జగన్‌కి పాత వీడియో చూపించండి విజయసాయిరెడ్డి గారూ 
  • మూడు ముక్కలాట కోసం 5 కోట్ల వకీలుని పెట్టుకున్నారు
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారు 
'సిగ్గు,శరం లేని మనిషి' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న నేరుగా విమర్శలు గుప్పిస్తూ ఆయనకే సిగ్గు లేదని ట్వీట్ చేశారు.

'సిగ్గు, లజ్జా లేని నాయకుడు జగన్‌ రెడ్డి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ మర్చిపోయినట్టు ఉన్నారు. ఒకసారి పాత వీడియో చూపించండి విజయసాయిరెడ్డి గారూ' అని విమర్శించారు.
 
'మూడు ముక్కలాట కోసం 5 కోట్ల వకీలుని పెట్టుకున్న జగన్ గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారు. నాడు తండ్రి, నేడు తనయుడు. 16,500 మంది బీసీలను పదవులకు దూరం చేస్తున్నారు. వైఎస్ కుటుంబం బీసీ ద్రోహులు అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అనవసరం' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.
Budda Venkanna
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News