Khushboo: అమెరికా యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న ఖుష్బూ.. ఫొటోలు ఇవిగో!

Actress Khushboo receives doctorate form American university
  • ఖుష్బూను డాక్టరేట్ తో సత్కరించిన ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం
  • భారత సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను డాక్టరేట్
  • వెంకటేశ్ తొలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం ఖుష్బూను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను డాక్టరేట్ తో గౌరవించింది. ఈ విషయాన్ని ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. వెంకటేశ్ తొలి సినిమా 'కలియుగ పాండవులు' చిత్రం ద్వారా తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు. రజనీకాంత్, కమలహాసన్, నాగార్జున వంటి స్టార్ల సరసన మెరిశారు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, టీవీ షోలతో ఆమె బిజీగా ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఖుష్బూ డాక్టరేట్ స్వీకరించిన నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Khushboo
Tollywood
Kollywood
Doctorate
International Tamil University
USA

More Telugu News