Rashmi Gautam: మొక్క నాటి అనసూయకు చాలెంజ్‌ విసిరిన జబర్దస్త్ యాంకర్‌ రష్మీ

Jabardasth anchor Rashmi challenges Anasuya over Green India Challenge
  • 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో ఉత్సాహంగా రోజా
  • సినీ నటులతో మొక్కలు నాటిస్తోన్న ఎమ్మెల్యే
  • అందరూ మొక్కలు నాటాలని రష్మీ పిలుపు 
'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో నగరి ఎమ్మెల్యే రోజా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పలువురు సినీ నటులతో ఆమె  'రోజా వనం' పేరిట మొక్కలు నాటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీతో ఆమె మొక్క నాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

రష్మీ మొక్క నాటుతుండగా రోజా పలు సూచనలు చేశారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా అందరూ మొక్కలు నాటాలని రష్మీ పిలుపునిచ్చింది. రోజా తనకు చాలెంజ్‌ విసిరారని, దీంతో మొక్క నాటానని చెప్పింది. 'ప్లాంట్స్ అనేవి చాలా ముఖ్యమండీ, ట్రీస్‌ అనేవి చాలా ముఖ్యం. చిన్నపిల్లలకు కూడా నేర్పించాలి' అని ఆమె వ్యాఖ్యానించింది.

మొక్కనాటాలని యాంకర్‌, సినీనటి అనసూయకు చాలెంజ్ విసిరింది. అలాగే, నటుడు సత్యదేవ్, శేఖర్‌ మాస్టర్‌లకు కూడా చాలెంజ్‌ విసురుతున్నట్లు తెలిపింది. 
Rashmi Gautam
Roja
Tollywood

More Telugu News