Venkaiah Naidu: వెంకయ్యనాయుడి చొరవతో ఏపీకి రూ.2498.89 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Centre grants 2489 crores for AP after Venkaiah Naidu talks
  • రైతుల సమస్యలపై స్పందించిన ఉపరాష్ట్రపతి
  • కేంద్రమంత్రులు, ఎఫ్ సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చలు
  • ఫలించిన వెంకయ్య చర్చలు
  • ఎఫ్ సీఐకి నిధులు మంజూరు చేసిన కేంద్రం
  • ఆ నిధులను ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనున్న ఎఫ్ సీఐ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ రైతుల పరిస్థితి పట్ల తగు రీతిలో స్పందించారు. రైతుల సమస్యలపై ఆయన ఇటీవలే పలువురు కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఏపీలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపులపై వారితో చర్చించారు. అంతేకాదు, ఎఫ్ సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులతోనూ చర్చించారు. వెంకయ్య చొరవ ఫలితంగా కేంద్రం ఇవాళ ఎఫ్ సీఐకి రూ.2.498.89 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఎఫ్ సీఐ ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది.
Venkaiah Naidu
Andhra Pradesh
Union Govenment
Farmers
FCI

More Telugu News