Varla Ramaiah: ఏపీలో ‘స్థానిక’ ఎన్నికలకు ఇది సరైన సమయం కాదని ఈసీకి చెప్పాం: వర్ల రామయ్య

Varla Ramaiah says We have told EC that this is not the right time for local elections
  • ఏపీలో ఒకపక్క విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నాయి
  • మరోపక్క ‘కరోనా’ వైరస్ భయపెడుతోంది
  • ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ కరెక్టు కాదని చెప్పాం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ‘ఇది సరైన సమయం కాదు’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ తరఫున చెప్పామని ఆ పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. విజయవాడలో రాజకీయపార్టీలతో ఈసీ నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఒకపక్క విద్యార్థుల పరీక్షలు, మరోపక్క కరోనా వైరస్ ప్రభావం ఉన్న తరుణంలో ఈ ఎన్నికలు నిర్వహించడం కరెక్టు కాదని తమ అభిప్రాయం చెప్పామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లు ఎవరికీ సంతృప్తిని ఇవ్వలేదని మరోమారు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జ్యుడిషియల్ ప్రక్రియ పూర్తి కాకముందే హడావుడిగా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించడం కరెక్టు కాదని సుస్పష్టంగా ఈసీకి తెలియజేశామని చెప్పారు.
Varla Ramaiah
Telugudesam
Andhra Pradesh
ec
Ramesh kumar

More Telugu News