Telugudesam: కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో ‘స్థానిక’ ఎన్నికలు వాయిదా వేయాలి: టీడీపీ నేతల డిమాండ్

Ap tdp leaders have written a letter to CM Jagan
  • ఓటింగ్ క్యూలైన్ల ద్వారా కరోనా ప్రమాదం పొంచి ఉంది
  • ‘స్థానిక’ ఎన్నికలు హడావుడిగా నిర్వహించాలని చూస్తున్నారు
  • సీఎం జగన్ కు టీడీపీ నేతల బహిరంగ లేఖ
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేతలు బహిరంగ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల కోతతో వారి హక్కులకు భంగం కల్పించారని, ఆ లేఖలో విమర్శించారు. ఈ ఎన్నికలు హడావుడిగా చేపట్టాలని చూడటం వల్ల బీసీల అవకాశాలను అణచివేయడమేనని, ఎన్నికల ప్రచారం, ఓటింగ్ క్యూలైన్ల ద్వారా కరోనా ప్రమాదం పొంచి వుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రాజకీయ అవకాశాల పరిరక్షణకు కృషి చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని ఆ లేఖలో కోరారు.
Telugudesam
Leaders
Andhra Pradesh
Jagan
cm

More Telugu News