Sajjala: రాష్ట్రంలో జగన్ వల్ల లాభపడని కుటుంబం లేదు: సజ్జల

Sajjala Ramakrishna Reddy lauds CM Jagan
  • 9 మాసాల్లో 90 శాతం హామీలు నెరవేర్చారని వెల్లడి
  • దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా కితాబు
  • రెండు, మూడు దశాబ్దాల పాటు వైసీపీనే అధికారంలో ఉండాలన్న సజ్జల
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ వల్ల లాభపడని కుటుంబం అంటూ లేదని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 9 నెలల్లో 90 శాతం హామీలను నెరవేర్చారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం అనుకూల ఫలితాలు రావాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

అయితే, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రెండు, మూడు దశాబ్దాల పాటు వైసీపీ అధికారంలో ఉండాలని అన్నారు. జగన్ దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడని, దేశం యావత్తు ఆయన అమలు చేసే పథకాల వైపే చూస్తోందని సజ్జల వివరించారు.
Sajjala
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News