Sensex: ఆర్థిక సంక్షోభం రానుందనే భయాలు.. కుప్పకూలిన మార్కెట్లు

Sensex Tanks 800 Points due to corona fears
  • మార్కెట్లపై కరోనా ప్రభావం
  • 893 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 279 పాయింట్లు పతనమైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడేను చవిచూశాయి. కరోనా వైరస్ భయాందోళనలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక సంక్షోభం రానుందనే భయాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 893 పాయింట్లు పతనమై 37,576కి పడిపోయింది. నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 10,989కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (1.20%), మారుతి సుజుకి (0.40%), ఏసియన్ పెయింట్స్ (0.13%).  

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-6.47%), టాటా స్టీల్ (-6.36%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.33%), ఓఎన్జీసీ (-4.27%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.84%).
Sensex
Nifty
Stock Market

More Telugu News