TTD: శ్రీవారి ఆర్జిత టికెట్లు జూన్ కోటా విడుదల

june kota tirumala seva tickets released
  • మొత్తం టికెట్లు 60,666 
  • ఆన్ లైన్ జనరల్ కేటగిరీవి 50,700 
  • కల్యాణం టికెట్లు 13,300

తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే పలు ఆర్జిత సేవలకు సంబంధించిన జూన్ నెల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. మొత్తం 60,666 టికెట్లు విడుదల చేయగా ఇందులో 50,700 టికెట్లు ఆన్ లైన్ జనరల్ కేటగిరీలో ఉంచారు. ఆన్ లైన్ డిప్ విధానంలో 9966 టికెట్లు విడుదల చేశారు. మొత్తం టికెట్లలో సుప్రభాతం 7,681, నిజపాదదర్శనం 1725, అష్టదళ పద్మారాధన 300, తోమాల 130, అర్చన 130 ఉన్నాయి. ఆన్ లైన్ కేటగిరీలో సహస్ర దీపాలంకార సేవ 17,400, కల్యాణం 13,300, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, ఊంజల్ సేవ 4,200, విశేష పూజలవి 1500 టికెట్లు ఉన్నాయి.

TTD
Tirumala
srivaru
seva tickets

More Telugu News