Allu Arjun: కాలం వేగంగా పరుగెడుతోంది.. మన మధ్య ప్రేమ మాత్రం ప్రతిరోజూ పెరుగుతోంది: అల్లు అర్జున్

Allu Arjun greets his wife on the occasion of wedding anniversary
  • అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం నేడు
  • 2011లో ప్రేమ వివాహం చేసుకున్న అల్లు అర్జున్
  • తన భార్యకు శుభాకాంక్షలు తెలిపిన బన్నీ
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లి ఫొటోను షేర్ చేసిన బన్నీ... తన భార్యపై అమితమైన ప్రేమాభిమానాలను కురిపిస్తూ మెసేజ్ పెట్టాడు. 'తొమ్మిదేళ్ల వివాహబంధం. కాలం వేగంగా పరుగెడుతోంది. కానీ మన మధ్య ప్రేమ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది' అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు. దీనికి తోడు భార్య, పిల్లలతో కేక్ కట్ చేసిన ఫొటోను ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. జీవితంలో ఎంతో విలువైన బహుమతులను (కుమారుడు, కుమార్తె) నాకు అందించినందుకు థాంక్యూ క్యూటీ అని తెలిపాడు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2011లో వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు.
Allu Arjun
Sneha Reddy
Wedding Anniversary
Tollywood

More Telugu News